TS : టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు అలర్ట్

TS : టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు అలర్ట్

పదో తరగతి విద్యార్థులకు నేడు, ఎల్లుండి గంటన్నర పాటే పరీక్షలు ఉండనున్నాయి. సైన్స్‌లో భాగంగా నేడు ఫిజిక్స్ (పేపర్-1), గురువారం బయాలజీ (పేపర్-2) నిర్వహించనున్నారు. ఉ.9.30 నుంచి మ.11 వరకే ఎగ్జామ్స్ ఉండనున్నాయి. చివరి 15 నిమిషాల ముందు అంటే ఉ.10.45 గంటలకు ఆబ్జెక్టివ్ (పార్ట్-B) పేపర్ ఇస్తారు. ఫలితాలు మాత్రం ఫిజిక్స్, బయాలజీ కలిపి ప్రకటిస్తారు. ఇక 30న సోషల్ స్టడీస్‌తో ప్రధాన పరీక్షలు ముగియనున్నాయి.

మరోవైపు ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్‌ను బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. వాల్యూయేషన్ కేంద్రాల్లోకి ఫోన్లను అనుమతించకూడదని ఆదేశించింది. గతంలో సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో 16 కేంద్రాల్లో 20 వేల మంది అధ్యాపకులు వాల్యూయేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. నాణ్యమైన మూల్యాంకనం కోసం ఒక్కొక్కరికి రోజుకు 30 పేపర్లు మాత్రమే ఇస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story