TS : తెలంగాణకు అమిత్ షా.... బీజేపీ శ్రేణుల్లో నయా జోష్

TS : తెలంగాణకు అమిత్ షా....  బీజేపీ శ్రేణుల్లో నయా జోష్

పార్లమెంట్ ఎన్నికల విషయంలో అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనే వ్యూహాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ఒక అడుగు ముందే ఉన్న బీజేపీ ప్రచారంలోనూ ప్రత్యర్థి పార్టీల కంటే స్పీడ్ పెంచింది. ఇప్పటి నుంచే బీజేపీ అగ్రనేతలను వరుసగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచార రంగంలోకి దింపుతోంది. ఈ నెల 4, 5 తేదీల్లో ప్రధాని మోదీ ఆదిలాబాద్, సంగారెడ్డిలో పర్యటించి బహిరంగసభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపిన విషయం తెలిసిందే. ప్రధాని పర్యటన ముగిసిన నేపథ్యంలో రాష్ట్రా నికి కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రానున్నారు.

ఈనెల 12వ తేదీన అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా షా బూత్ కమిటీ అధ్యక్షులు, ఆపై స్థాయి నేతలతో సమావేశం అవుతారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన కార్యచరణపై రాష్ట్ర నేతలకు కీలక సలహాలు, సూచనలు అందించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ ప్రజాహిత యాత్ర, విజయ సంకల్ప యాత్రలతో లోక్సభ ఎన్నికల బరిలోకి ముందుగానే దిగింది.

లోక్సభ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో బీజేపీలో అపర చాణక్యుడిగా పేరుగాంచిన అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సారి షా రాష్ట్ర పర్యటన పూర్తిగా రాజకీయ కోణంలోనే సాగనున్నట్లు తెలిసింది. షా పర్యటన నేపథ్యంలో బీజేపీ నాయకత్వం అన్న విభాగాల్లో కార్యకలాపాలను ముమ్మరం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story