TS : తెలంగాణలో బీర్లు తాగుడే తాగుడు..

TS : తెలంగాణలో బీర్లు తాగుడే తాగుడు..

తెలంగాణ రాష్ట్రంలో దంచుతున్న ఎండలకు బీరు సీసాలు ఖాళీ అవుతున్నాయి. ఎండలు ఏ రేంజ్ లో దంచి కొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీలేదు. ఉదయం 9 దాటితే నిప్పుల కొలిమిలా మారుతుంది. ఇంట్లో నుండి అడుగు భయటపెట్టాలనే ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం 7 వరకు కూడా వేడి ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో.. మద్యం ప్రియులు బీర్లను ఆశ్రయిస్తున్నారు.

తాజాగా ఎక్సెజ్ అధికారులు తెలిపిన లెక్కల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులు రూ.670 కోట్ల విలువైన 23 లక్షల కేసుల బీర్లను తాగేశారట. ఇది ఆల్టైమ్ రికార్డు అని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారు. గతేడాది ఇదే నెల కంటే 28.7% అధికంగా బీర్ల అమ్మకాలు జరిగాయని చెప్పుకొచ్చారు. గత 15 రోజులుగా బీర్ల తయారీ తగ్గడంతో అమ్మకాలు ఇంకాస్త తగ్గాయని లేదంటే ఇంకా పెరిగి ఉండేదని అంటున్నారు.

వర్ష ప్రభావం లేకపోవడంతో బీర్ల కొరత ఏర్పడిందని.. డిమాండ్ తగ్గ బీర్లను అందించలేకపోతున్నామని చెపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story