TS : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి వరంగల్ మేయర్

TS : బీఆర్ఎస్ కు బిగ్ షాక్..  కాంగ్రెస్ లోకి వరంగల్ మేయర్

వరంగల్ మేయర్, మాజీ ఎంపీ గుండు సుధారాణి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు టీడీపీలో ఉన్న సుధారాణి 2002 నుంచి 2004 వరకు టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. 2010లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మరోవైపు వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సైతం హస్తం పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గత కొంతకాలంగా గుండు సుధారణిల బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల కేటీఆర్ వరంగల్ పర్యటనకు ఆమె డుమ్మా కొట్టారు. బీఆర్ఎస్ స్వాగతం పలుకుతూ సమావేశాల దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో మేయర్ సుధారాణి ఫోటో ఎక్కడ కనిపించలేదు. దీంతో ఆమె పార్టీని వీడుతారనే ప్రచారం సాగింది. అనుకున్నట్లే కాంగ్రెస్‌ గూటికి చేరారు.

Tags

Read MoreRead Less
Next Story