Bill Gates : 25 ఏళ్ల తర్వాత హైదరాబాద్ ఆఫీసుకు బిల్ గేట్స్

Bill Gates : 25 ఏళ్ల తర్వాత హైదరాబాద్ ఆఫీసుకు బిల్ గేట్స్

25 ఏండ్ల క్రితం హైదరాబాద్ లో (Hyderabad ) తాను ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ను ఆ సంస్థ అధినేత బిల్ గేట్స్ (Bill Gates) సందర్శించా రు. అనంతరం ఐడీసీలో ఇంజినీర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐడీసీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. భవిష్యత్ లో ఏఐ, క్లౌడ్, గేమింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో మైక్రోసాఫ్ట్ ఆవిష్కరణలకు ఐడీసీ కేంద్రం కానుందని తెలిపారు. ఏఐ పవర్డ్ ఇండియాపై బిల్ గేట్స్ మరోసారి ఆశాభావం వ్యక్తం చేశారని పేర్కొన్నా రు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఐడీసీ కీలక పాత్ర పోషిస్తోంది. 1998లో ఐడీసీని బిల్ గేట్స్ ప్రారంభించగా.. గతేడాది డిసెంబర్ 5న మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ హాజరయ్యారు.

భువనేశ్వర్ మురికి వాడల్లో బిల్ గేట్స్..

మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బుధవారం ఉదయం భువనేశ్వర్ లోని మురికి వాడలను సందర్శించారు. మా మంగ్లా బస్తీలోని బిజు ఆదర్శ్ కాలనీలో పర్యటిస్తూ అక్కడి ప్రజలతో మాట్లాడారు బిల్ గేట్స్. అక్కడి ప్రజల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారని, మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తో కలిసి వివిధ ప్రభుత్వ విభాగాలు మురికి వాడల అభివృద్ధి కోసం పని చేస్తున్నాయి. ఈ సందర్భంగా స్లమ్ ఏరియాలో ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలపై బిల్ గేట్స్ కు అధికారులు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story