TS : ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ వాయిదా

TS : ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 4వ తేదీకి వాయిదా పడింది. మెరిట్ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా బెయిల్ ఇవ్వలేమన్నారు న్యాయమూర్తి. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయంటూ బెయిల్ కోరుతూ కోర్టుకెళ్లారు కవిత. ఏప్రీల్ 16వ తేదీ వరకు బెయిల్ కావాలంటూ పిటిషన్ వేశారు. ఇరువురి వాదనలు విన్న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి విచారణ వాయిదా వేశారు. ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కవిత.. తీహార్ జైలులో ఉన్నారు.

రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరుఫున న్యాయవాది సింఘ్వీ విచారణకు హాజరయ్యారు. కవిత బెయిల్ పై ఈడీ టెక్నికల్ ఇష్యూలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. లిక్కర్ స్కాం కేసులో కవిత విచారణకు సహకరించినా.. అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. లిక్కర్ స్కాం FIRతోపాటు అరుణ్ పిళ్లై 9 స్టేట్మెంట్లలో కవిత పేరు లేదన్నారు. కానీ పదో వాంగ్మూలం పూర్తి విరుద్దంగా ఉందన్నారు సింఘ్వీ.

బుచ్చిబాబు స్టేట్మెంట్ లో విజయ్ నాయర్ తో సంభాషణపై ఎలాంటి ప్రస్తావన చెప్పలేదని కోర్టుకు వివరించారు సింఘ్వీ. కవిత బెయిల్ పై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రిప్లై ఇచ్చామన్నారు ఈడీ అధికారులు. కొన్ని టెక్నికల్ అంశాలను పరిశీలించాలని జడ్జిని కోరారు. దీంతో కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలను ఈనెల 4వ తేదీకి వాయిదా వేశారు జడ్జి.

Tags

Read MoreRead Less
Next Story