TS : బీఆర్ఎస్‌కు ఒక్కటే..! ఏబీపీ సీఓటర్ సంచలన సర్వే

TS : బీఆర్ఎస్‌కు ఒక్కటే..! ఏబీపీ సీఓటర్ సంచలన సర్వే

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉంది కాంగ్రెస్ పార్టీ. లోక్ సభ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లే కాదు.. మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. 15 లోక్ సభ సీట్లు ఆ పార్టీ పెట్టుకున్న టార్గెట్.

కాంగ్రెస్ పార్టీలో జోరు నింపేలా ఏబీపీ న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన 4 నెలల్లోనే ఆకర్షణీయమైన గ్యారంటీలు అమలుచేసి ఓటర్ల నాడి పసిగట్టారని సర్వేతేల్చింది. కాంగ్రెస్ కనీసం 10 సీట్లు గెలుస్తుందని సర్వేలో అభిప్రాయం వెల్లడైంది.

తెలంగాణ లోక్ సభ సంగ్రామంలో రెండో స్థానంలో బీజేపీ ఉంటుందని సర్వేలో తేలింది. బీజేపీకి తెలంగాణలో ఇంతకు ముందు నలుగురు ఎంపీలు ఉండగా.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆ స్థానాల సంఖ్య ఐదుకు చేరుతుందని ఏబీపీ న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయింది. ఒక సీట్ అదనంగా బీజేపీ గెలుస్తుందని సర్వే తెలిపింది. ఐతే.. బీజేపీకి ఓటు బ్యాంక్ భారీగా పెరిగిపోతుందని తేల్చింది.

కేసీఆర్ కు షాకిస్తూ ఏబీపీ సీఓటర్స్ సర్వే వెల్లడైంది. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటులోనే గెలుస్తుందనేది సర్వేలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఆ పార్టీని డీగ్రేడ్ చేయడం.. కవిత అరెస్ట్.. ఇలాంటి అంశాన్నీ బీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారాయని సర్వేలో మెజారిటీ సంఖ్యలో జనం అభిప్రాయపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story