TS : కవిత బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు: సీఎం రేవంత్

TS : కవిత బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు: సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ‘జైలులో ఉన్న బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, బీఆర్ఎస్ ను మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారు. బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి మళ్లించాలని కేసీఆర్ చెప్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు ప్రచారమే చేయట్లేదు’ అని వ్యాఖ్యానించారు.

మరోవైపు పంట రుణాల మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నాటికి రూ.2,00,000 రుణమాఫీ చేస్తానని స్పష్టం చేశారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణాలు మాఫీ చేస్తానని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున రుణాలు మాఫీ చేయలేదని తెలిపారు. ఇక వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొనుగోలు చేస్తామన్నారు. నారాయణపేట జనజాతర సభలో రేవంత్ ఈ ప్రకటనలు చేశారు.

దొరలకు, పెత్తందారులకు కాకుండా బీసీలు, సామాన్యులకు కాంగ్రెస్ ఎంపీ టికెట్లు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ‘రాష్ట్రంలో 10% జనాభా ఉన్న ముదిరాజ్‌లకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. వారిని బీసీ-D నుంచి బీసీ-A గ్రూప్‌లోకి మార్చేందుకు ప్రయత్నిస్తాం. మంచి లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో కేసు గెలిచేలా పోరాడుతాం. 15 ఎంపీ సీట్లను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తా’ అని ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story