TS : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వాన్ని మా చేతిలో పెడతాయి: మోదీ

TS : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వాన్ని మా చేతిలో పెడతాయి: మోదీ

కేంద్రంలో సంకీర్ణం వస్తుందని కేసీఆర్ చేస్తోన్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆయన ఎప్పుడూ ఇలాంటి అబద్ధాలే చెబుతారు. GHMC ఎన్నికలయ్యాక కేసీఆర్ నా దగ్గరికి వచ్చారు. NDAలో చేరతా అన్నారు. కానీ మేం విపక్షంలోనే ఉండి పోరాడతాం అని చెప్పా. ఇప్పుడు కాంగ్రెస్- బీఆర్ఎస్ చెరోవైపు బండి(ప్రభుత్వం)ని లాగుతున్నాయి. త్వరలో దాన్ని బీజేపీ చేతిలో పెట్టి వెళ్లిపోతాయి. చూస్తూ ఉండండి’ అని పేర్కొన్నారు.

అవినీతిలో పతకాలు ఇస్తే కాంగ్రెస్‌కు గోల్డ్ మెడల్, బీఆర్‌ఎస్‌కు సిల్వర్ మెడల్ వస్తుందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ‘సీఎం రేవంత్ నన్ను బడే భాయ్ అని పిలవడం సంతోషకరం. కానీ పెద్దల నుంచి చిన్నవాళ్లు మంచి విషయాలు నేర్చుకోవాలి కదా? సీఎంగా, పీఎంగా అందరికంటే ఎక్కువ కాలం ఒక్క మచ్చా లేకుండా పనిచేశా. దీన్ని తమ్ముడు నేర్చుకోవాలి. అన్నిచోట్లా పెద్దన్నా పెద్దన్నా అని వెంటపడితే కుదరదు’ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

కర్ణాటక, తెలంగాణ.. కాంగ్రెస్‌కు ఏటీఎంలుగా మారిపోయాయని మోదీ ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిందే ఈ 2 రాష్ట్రాల్లో త్వరలో జరగబోతోందన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో అవినీతి రాకెట్ నడుస్తోంది. కాంగ్రెస్ , బీఆర్ఎస్ ఒకటే. ప్రస్తుతం కమీషన్ లేకుండా ఏ పనీ జరగట్లేదు. లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ పేరుంది. ఇక టెక్నాలజీ హబ్‌గా ఉన్న కర్ణాటక ఇప్పుడు ట్యాంకర్ హబ్‌గా మారిపోయింది’ అని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story