TS : కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు!

TS : కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు!

మల్కాజిగిరి (Malkajigiri) లోక్ సభ రాజకీయం ఇప్పుడు రాష్ట్రమంతటా మాత్రమే కాదు దేశమంతటా హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవేంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఈ లోక్ సభ సెగ్మెంట్ లో ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు అనేది ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ కూడా ప్రెస్టీజియస్ గా తీసుకుని ఈ స్థానంలో ఈటల రాజేందర్ ను బరిలోకి దింపింది. మళ్లీ కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని పట్టుమీదున్న రేవంత్ రెడ్డి.. రాజకీయ ఎత్తుగడలతో దూసుకుపోతున్నారు. బీజేపీకి భారీ ఝలక్ ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం వరకు మల్కాజిగిరిలో ఈటల రాజేందర్‌తో కలిసి బీజేపీ తరపున ప్రచారం చేశారు. శ్రీగణేశ్ హఠాత్తుగా పార్టీ మారడం బీజేపీ శ్రేణులను షాక్‌కు గురి చేసింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో అనివార్యమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజకీయ పరిణామాల్లో రాజకీయాలు వేడెక్కాయి. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేష్ నారాయణన్.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం రాత్రి టికెట్‌ హామీ ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ నివాసంలో జరిగిన ఈ చేరిక కార్యక్రమానికి మైనంపల్లి హనుమంతరావు, మహేందర్‌రెడ్డి సహా ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు.

ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సూచనల మేరకు వారి సమక్షంలోనే శ్రీగణేష్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ లో చేరానని చెప్పారు శ్రీగణేష్ నారాయణన్. లోక్‌సభ ఎన్నికల్లోనూ, కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తన సత్తాను చాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story