TS : కేసీఆర్ లిల్లీపుట్ కామెంట్స్‌పై కాంగ్రెస్ ఫైర్

TS : కేసీఆర్ లిల్లీపుట్ కామెంట్స్‌పై కాంగ్రెస్ ఫైర్

మెదక్ లోక్ సభ సన్నాహక సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ చేసిన కామెంట్లు రచ్చ రచ్చ చేస్తున్నాయి. లిల్లీపుట్ గాళ్లు అంటూ రేవంత్ రెడ్డి హైట్ ను ఎద్దేవా చేశారు కేసీఆర్. తన ముడ్డి మీద చెడ్డీ లాగుతానన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ పై ఫైరయ్యారు. ఓ సీఎం స్థాయి వ్యక్తి ఎప్పుడైనా ఇలా అనొచ్చా అంటూ ఫైరయ్యారు.

కేసీఆర్ కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో రియాక్టవుతున్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్ కర్నూల్ అభ్యర్థి మల్లురవి సెటైర్లు వేశారు. కేసీఆర్ అహంకారంతో తెలంగాణ దివాళా తీసిందన్నారు. బీఆర్ఎస్ ఖాళీ అయిందని.. కేసీఆర్ వెనక ఎవ్వరూ లేరన్నారు. అందరూ రేవంత్ నాయకత్వంలో పనిచేయాలనుకుంటున్నారన్నారు.

రేవంత్ బీజేపీలోకి వెళ్తాడన్న మాటనలు తిప్పికొట్టారు కాంగ్రెస్ నేతలు. కవితను జైలు నుంచి విడిపించుకునేందుకు.. కేసీఆర్ బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. కేసీఆర్ లిల్లీపుట్ మాటలు మాని బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story