TS : శోభాయాత్రలో రామబాణం.. మాధవీలత Vs అసదుద్దీన్‌

TS : శోభాయాత్రలో రామబాణం.. మాధవీలత Vs అసదుద్దీన్‌

శ్రీరామనవమి రోజు శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత విసిరిన ఓ బాణం వివాదం రగిల్చింది. ఈ బాణం మసీదుపై పడిందంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఉద్దేశపూర్వకంగా వైరల్ చేస్తున్నారని మాదవీలత మండిపడుతున్నారు. దీనిపై అటు మజ్లిస్, ఇటు బీజేపీ మధ్య డైలాగ్ వార్ హీటెక్కుతోంది.

"నేను బాణం మసీదుపై వేయలేదు. నా చేయి అటువైపు లేనేలేదు. వీడియోలో కొంత భాగం చూపెట్టి మత విద్వేషాలు రగిల్చే కుట్ర చేస్తున్నారు. ఇది అసంపూర్ణ వీడియో అని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. హిందూ, ముస్లింలను సమానంగా భావిస్తా. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా నేను క్షమాపణ కోరుతున్నా. కుట్రలు చేస్తే పతంగి తెంపేస్తా.. చింపేస్తా" అంటూ ఫైరయ్యారు మాధవీలత.

స్పందించిన AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఈసీ గుడ్డిదా అని ప్రశ్నించారు. రాజా సింగ్‌ కించపరిచే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. 'హైదరాబాద్ ప్రజలు బీజేపీ ఉద్దేశాలను చూశారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ అసభ్యకర, రెచ్చగొట్టే చర్యలను తాము అంగీకరించబోం. ఇదేనా బీజేపీ చెబుతున్న 'వికసిత్ భారత్'? హైదరాబాద్ శాంతిభద్రతల కంటే ఎన్నికలు పెద్దవా? రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే బీజేపీకి తెలంగాణ ప్రజలు ఓటు వేయరని నాకు నమ్మకం ఉంది'' అని అన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఈసీ గమనిస్తోంది. రెండు పార్టీలకు దీనిపై ఓ సూచన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story