బీఆర్ఎస్‌ లోక్ సభలో డకౌట్ కానుందా..?

బీఆర్ఎస్‌ లోక్ సభలో డకౌట్ కానుందా..?

"ఒక్కటంటే.. ఒక్క లోక్ సభ సీటు (Lok Sabha Seat) గెల్చుకుని రావాలి" అంటూ కేసీఆర్ (KCR),కేటీఆర్ (KTR), హరీశ్ రావులకు (Harish Rao) రేవంత్ రెడ్డి (Revanth Reddy) సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి అన్నేసి మాటలన్నా… బీఆర్ఎస్ వైపు నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. బాల్క సుమన్ లాంటి వాళ్లను ముందు పెట్టి ప్రతి సవాల్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

బీఆర్ఎస్‌పై రేవంత్ రెడ్డి ఒంటి కాలి మీద లేస్తున్నారు. చేవెళ్ల బహిరంగ సభలో కేసీఆర్, కేటీఆర్ పై రేవంత్ రెడ్డి విచురుకుపడిన వైనం వైరల్ గా మారింది. ఓ వైపు రేవంత్.. ఆరు గ్యారంటీల విషయంలో తన పని తాను చేసుకుపోతున్నారు. గ్యాస్ సిలిండర్, రెండు వందల యూనిట్ల విద్యుత్ ఫ్రీ హామీలను ప్రారంభించారు.

బీజేపీతో పొత్తులంటూ తిరుగుతున్న బీఆర్ఎస్ ఇమేజ్ రోజురోజుకూ డ్యామేజ్ అవుతోంది. పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. బీఆర్ఎస్ పరిస్థితి రానురాను దిగజారిపోతోంది. ఆ పార్టీకి లోక్ సభ అభ్యర్థులే కాదు.. ఎజెండా కూడా లేకుండా పోయింది. కృష్ణా నీటిని ఎజెండాగా చేద్దామనుకుంటే.. మేడిగడ్డతో రివర్స్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి కాళేశ్వరం కాగ్ అవినీతి రిపోర్టుతో దెబ్బతిన్న బీఆర్ఎస్ దగ్గర.. ఓట్లు అడిగేందుకు అజెండా లేకుండా పోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story