BRS-BSPల్లో భూకంపం.. పొత్తు రేపిన అలజడి

BRS-BSPల్లో భూకంపం.. పొత్తు రేపిన అలజడి

కేసీఆర్ (KCR) ఏది ముట్టుకున్నా బీఆర్ఎస్ కు (BRS) నష్టమే జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి జంపింగ్స్ పెరిగిపోవడంతో.. చిన్న పార్టీల సపోర్ట్ తీసుకునే దుస్థితిలో ఉన్నారు కేసీఆర్. ఐతే.. అదే ఆయనకు.. ఆయన పార్టీకి మరిన్ని ఊహించని చిక్కులు తెచ్చిపెడుతోంది.

బీఎస్పీ సపోర్ట్ తో లోక్ సభ ఎన్నికలకు వెళ్తున్నారు కేసీఆర్. హైదరాబాద్‌ నంది నగర్ లోని తన ఇంటికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పిలిపించుకుని చర్చించారు. పొత్తు పెట్టుకున్నామని... సీట్ల గురించి త్వరలోనే అన్ని వివరాలు చెబుతామని కేసీఆర్, ఆర్ఎస్పీ ఉమ్మడి ప్రకటన చేశారు. ఐతే.. ఇది ఆ రెండు పార్టీలనూ ఇబ్బంది పెడుతోంది.

బీఆర్‌ఎస్, బీఎస్పీ పొత్తు గులాబీ పార్టీలో చిచ్చు చేపుతోంది. గత ఎన్నికల్లో బీఎస్పీ చీఫ్‌ ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ సిర్పూర్‌ నుంచి పోటీ చేశాడు. అక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోనేరు కోనప్ప, బీజేపీ నుంచి హరీశ్‌బాబు పోటీ చేశారు. చివరకు బీజేపీ గెలిచింది. అయితే తన ఓటమికి బీఎస్పీ కారణమని కోనప్ప భావిస్తున్నారు. ఆ ఎన్నికల్లో ప్రవీణ్‌కుమార్‌కు 40 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. కోనప్ప 10 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. తనను ఓడించిన వ్యక్తితో కలిసి ఎలా పనిచేయాలని కోనప్ప కూడా ప్రశ్నించారు.

ప్రస్తుతం నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న పోతుగంటి రాములు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు అనుచరులతో మంతనాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారంలోగా ముహూర్తం చూసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరటానికి రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు లేదా రేపు రాములు తన నిర్ణయం అధికారికంగా ప్రకటించనున్నారు. అటు బీఎస్పీలోనూ చీలిక ఖాయమైంది. ఇన్నాళ్లు ప్రశ్నించిన కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ పనిచేయడాన్ని ఆ పార్టీ ముఖ్య నేతలు వ్యతిరేకిస్తూ బహిరంగ విమర్శలు చేస్తున్నారు. హైకమాండ్ మాయావతి కంప్లయింట్లు చేస్తున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ తర్వాత ముగ్గురు సిట్టింగ్‌ ఎంపీలు బీఆర్‌ఎస్‌ను వీడారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత కాంగ్రెస్‌లో చేరగా, జహీరాబాద్‌ ఎంపీ బీబీ.పాటిల్, నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు బీజేపీలో చేరారు. పొత్తులో భాగంగా బీఆర్‌ఎస్‌ బీఎస్పీకి రెండు ఎంపీ సీట్లు కేటాయిస్తుందని తెలుస్తోంది. నాగర్‌కర్నూల్‌ టికెట్‌ బీఎస్పీ చీఫ్‌ ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పోటీ చేస్తారని సమాచారం. మరో టికెట్‌ ఎక్కడ అనేది క్లారిటీ రావాల్సి ఉంది. 17 సీట్లలో హైదరాబాద్‌ ఎంఐఎంకు పోను, రెండు బీఎస్పీకి ఇస్తుంది. దీంతో మిగతా 14 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేయనుంది. ఐతే.. బీఆర్ఎస్ కు క్యాండిడేట్లు దొరకడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story