యాదాద్రి ఆలయ విస్తరణ.. భూములు కోల్పోయిన నిర్వాసితుల ఆందోళన

యాదాద్రి ఆలయ విస్తరణ.. భూములు కోల్పోయిన నిర్వాసితుల ఆందోళన
పరిహారం ఎందుకు చెల్లించడం లేదని అధికారుల్ని నిలదీస్తూ... అభివృద్ధి పనుల్ని అడ్డుకున్నారు.

యాదాద్రి ఆలయ విస్తరణలో భూములు కోల్పోయిన నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. పరిహారం ఎందుకు చెల్లించడం లేదని అధికారుల్ని నిలదీస్తూ... అభివృద్ధి పనుల్ని అడ్డుకున్నారు. ఇల్లుకు ఇల్లు, స్థలానికి స్థలం ఇస్తామన్న కేసీఆర్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు. సీఎం ఆదేశాలను అధికారులు పాటించడం లేదా?... అధికారులతో సీఎం అలా చెప్పిస్తున్నారా?.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే సీఎం నివాసం వరకు పాదయాత్ర చేస్తామని స్పష్టంచేశారు.

యాదాద్రి కొండ చుట్టూ నాలుగు లేన్ల రోడ్డు కోసం ప్రభుత్వం భూమి సేకరించింది. అంజనాపురిలో స్థానికులు 50 ఇళ్లు కోల్పోయారు. వీరికి ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమ చేసింది. కానీ.. ఖాళీ స్థలాలు కోల్పోయిన 120 మంది నిర్వాసితులకు పరిహారం అందలేదని బాధితులు మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ హామీ ప్రకారం సైదాపురంలో స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story