TS : కేసీఆర్ గొప్ప నాయకుడు .. పక్కన ఉన్నోళ్లు భ్రష్టు పట్టించారు : దానం నాగేందర్

TS : కేసీఆర్ గొప్ప నాయకుడు .. పక్కన ఉన్నోళ్లు భ్రష్టు పట్టించారు :  దానం నాగేందర్

మాజీ సీఎం కేసీఆర్ (KCR) గొప్పనాయకుడైనప్పటికీ ఆయన చుట్టూ ఉన్న వారే కేసీఆర్ ను భ్రష్టు పట్టించారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) ఆరోపించారు. బంజారా ఫంక్షన్ హాల్లో జరిగిన ఇఫ్తార్ విందు లో పాల్గొన్న దానం నాగేందర్ విందు అనంతరంమీడియాతో మాట్లాడారు. తాను ఆస్తులను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారనే ఆరోపణలో వాస్తవం లేదన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తాను సంపాదించుకున్నది ఏమీ లేదని చెప్పారు. తాను అక్రమ ఆస్తులు సంపాధించినట్లు రుజువు చేస్తే వాటిని ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తన శాసనసభ అభ్యర్థిత్వం పై కేటీఆర్ న్యాయస్థానానికి వెళ్లితే న్యాయస్థానంలోనే సమాధానం చెప్పనున్నట్లు దానం తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డిపై అవసరమైన ఆరోపణలు చేయడం కేటీఆర్ మానుకోవాలన్నారు. మూడునెల్లో సీఎం రేవంత్ రెడ్డి రూ. 3,500కోట్లు సంపాధించారని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణకు ఆయన స్పందిస్తూ 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ నాయకులు ఎన్నిలక్షల కోట్లు సంపాదించారో చెప్పాలని దానం డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story