TS : మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్

TS : మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్

మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్లలోని నివాసం వద్ద 3 రోజులుగా రెక్కీ నిర్వహించి అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలోనే పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రికిరాత్రి ఆయన్ని హైదరాబాద్​కు తరలించినట్లు సమాచారం. ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రణీత్​రావును హైదరాబాద్‌​కు తరలించారు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్​లో స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన అనంతరం బుధవారం ఉదయం నాంపల్లి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. ఎస్ఐబీలోని హార్డ్ డిస్క్‌ల ధ్వంసం, రికార్డుల మాయం వ్యవహారంలో ఆయనపై పంజాగుట్ట స్టేషన్‌లో కేసు నమోదైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్‌పై ఆరోపణలు వచ్చాయి. ప్రణీత్‌రావుతో పాటు ఆయనకు సహకరించిన పలువురు అధికారుల్ని సైతం అధికారులు విచారణ చేపట్టే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story