TS : కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు

TS : కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2018లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2023 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. కాషాయం పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆడే గజేందర్, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంఛార్జి మంత్రి సీతక్క విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ముందుకు సాగుతున్నారు. మంత్రి సీతక్క అధ్వర్యంలో ఇటివలే సిర్పూర్ (టి) మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే తరహాలో జిల్లాలో వివిధ పార్టీల నాయకులు, ఎంపిపిలు, జడ్పిటిసిలు, మున్సిపల్ చైర్మన్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో చేరికల పరంపర పెరిగింది

Tags

Read MoreRead Less
Next Story