TS : మాజీ స్పీకర్ పోచారంకు బిగ్ షాక్

TS : మాజీ స్పీకర్ పోచారంకు బిగ్ షాక్

మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) తనయుడు, నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పై డైరెక్టర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మొత్తం 25 మంది డైరెక్టర్లకు గాను 20 మందికి ఓటు హక్కు ఉంది. మిగతా ఐదుగురు అధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఇవాళ డీసీసీబీ కార్యాలయం లో బలపరీక్ష నిర్వహించారు. 20 మంది ఓటు హక్కున్న డైరెక్టర్లలో 17 మంది అవి శ్వాసానికి అనుకూలంగా ఓటు వేయగా.. ముగ్గురు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు అధికారులు ప్రకటించారు.

ప్రస్తుతం వైస్ చైర్మన్ గా వ్య వహరిస్తున్న వేల్పూర్ సింగిల్ విండో చైర్మన్ ఇన్చార్జి చైర్మన్గాగా ఎన్నికైన రమేశ్ రెడ్డి రమేశ్ రెడ్డికి ఇన్ చార్జిగా బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ డీసీసీబీ అధ్యక్ష ఎన్నికను ఈ నెల 26న నిర్వహించనున్నారు. మొత్తం 20మంది డీసీసీబీ డైరెక్టర్లలో 17 మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా మారి పోవడంతో ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు.

ప్రస్తుతం ఇన్ చార్జిగా వ్యవహరిస్తు న్న వేల్పూర్ విండో చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ రమేశ్ రెడ్డి చైర్మన్ గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. రమేశ్ రెడ్డి ఎన్నిక లాంఛనమేనని తెలుస్తోంది. ఇదిలా ఉండగా వేల్పూర్.. మొన్నటి వరకు మంత్రిగా వ్యవహరించిన వేముల ప్రశాంత్ రెడ్డి స్వగ్రామం.

Tags

Read MoreRead Less
Next Story