TS : తెలంగాణలో బీర్లకు ఫుల్ డిమాండ్

TS : తెలంగాణలో బీర్లకు ఫుల్ డిమాండ్

రోజురోజుకు ఎండలు మండిపోతుండటంతో తెలంగాణలో బీర్లకు డిమాండ్ పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి 18 వరకు రూ.670 కోట్ల విలువైన 23 లక్షల కేస్‌ల బీర్లను తాగేశారు. ఇది ఆల్‌టైమ్ రికార్డు అని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గతేడాది ఇదే నెల కంటే 28.7% అధికంగా బీర్ల అమ్మకాలు జరిగాయని చెప్పారు. కొన్ని చోట్ల బీర్ల కొరత ఉండగా, దాన్ని అధిగమించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజుకు 60 వేల నుంచి 80 వేల కేస్ లకు పైగా బీర్లు అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. సమ్మర్ లో వీటికి అదనంగా మరో 20 వేల కేస్ లు డిమాండ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం డిమాండ్ కు తదిన స్టాక్ లేకపోవడంతో మద్యం డిపోలు 60 వేల నుంచి 80 వేల కేస్ లను మద్యం షాపులకు సరఫరా చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో...మందుబాబులు బీర్లు లాగించేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story