Top

రసవత్తరంగా గ్రేటర్ పోరు

రసవత్తరంగా గ్రేటర్ పోరు
X

గ్రేటర్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. నామినేషన్లు పూర్తి కావడంతో అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిసుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు కూడా గడువు ముగియడంతో బల్దియా పోరులో ఎంత మంది నిలిచారో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల్లో 150 వార్డుల్లో కలిపి మొత్తం 1122 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కంటే ఈసారి తక్కువ మంది అభ్యర్థులు పోటీకి దిగారు. 2016 ఎన్నికల్లో 1333 మంది పోటీ చేశారు.

అత్యధికంగా టీఆర్ఎస్ 150 డివిజన్లలో అభ్యర్థులు నిలిపింది. బీజేపీ 149 స్థానాల్లో బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్ 146 స్థానాల్లో పోటీ చేస్తోంది. తెలుగుదేశం 106, ఎంఐఎం 52 చోట్ల పోటీ చేస్తున్నాయి. వామపక్షాల్లో సీపీఐ 17, సీపీఎం 12 చోట్ల తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. మొత్తం 415 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలిచారు. అత్యధికంగా జంగమ్మెట్ లో 20 మంది, అత్యల్పంగా ఉప్పల్, బార్కాస్, నవాబ్ సాహెబ్ కుంట, టీలీచౌక్, జీడిమెట్ల డివిజన్లలో ముగ్గురు అభ్యర్థులు చొప్పున పోటీ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES