Good News : సికింద్రాబాద్ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రెయిన్స్

Good News :  సికింద్రాబాద్ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రెయిన్స్

సమ్మర్ లో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ముఖ్యంగా కేరళలోని కొల్లం, పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్, సాంత్రాగాచి లకు రైళ్లను నడుపనున్నామని అధికారులు వివరించారు. సికింద్రాబాద్‌-సాంత్రాగాచి (07223) రైలు ప్రతి శుక్రవారం బయలు దేరడంతో పాటు ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 29 వరకు 11 ట్రిప్పులు నడుస్తుదని అన్నారు.

ప్రతి శనివారం తిరుగు ప్రయాణమయ్చే సాంత్రాగాచి-సికింద్రాబాద్‌ (07224) రైలు ఏప్రిల్‌ 20 నుంచి జూన్‌ 29 వరకు 11 ట్రిప్పులు నడుస్తుందని ఆఫీసర్లు వివరించారు. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడలో ఆగుతుందని తెలిపారు. గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్‌, కటక్‌, ఖరగ్‌పూర్‌ మీదుగా రాకపోకలు కొనసాగిస్తాయని వెల్లడించారు. సికింద్రాబాద్‌ -షాలిమార్‌ (07225) ప్రత్యేక రైలు ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 24వ తేదీ వరకు ప్రతి సోమవారం, షాలిమార్‌-సికింద్రాబాద్‌(07226) రైలు ఏప్రిల్‌ 16 నుంచి జూన్‌ 25 వరకు ప్రతి మంగళవారం బయలుదేరుతాయని తెలిపారు. సికింద్రాబాద్‌ -కొల్లం (07193) మధ్య ప్రత్యేక రైలు ఏప్రిల్‌ 17,24, మే 1, 8,15,22,29, జూన్‌ 5, 12, 19, 26 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి బయలు దేరుతుందని ఎస్‌సీఆర్‌(SCR) అధికారులు వివరించారు.

తిరుగుప్రయాణంలో కొల్లం-సికింద్రాబాద్‌(07194) రైలు ఏప్రిల్‌ 19, 26, మే 3,10,17, 24, 31, జూన్‌ 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ రైలు తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు ప్రకటించారు. సో.. రైల్వే టైమింగ్స్ అనుగుణంగా మీ ప్రయాణాలు మార్చుకోండి.

Tags

Read MoreRead Less
Next Story