TS : రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ .. ప్రభుత్వం జీవో జారీ

TS : రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ .. ప్రభుత్వం జీవో జారీ

కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Government) ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన ‘మహాలక్ష్మి’లో మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. అర్హులైనవారికి రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. తెల్లరేషన్‌ కార్డు ఉన్నవాళ్లకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారు ఈ పథకానికి అర్హులుగా తెలిపింది.

మహిళ పేరుపై గ్యాస్‌ కనెక్షన్‌ ఉండాలన స్పష్టం చేసింది. గత మూడేళ్ల వినియోగం ఆధారంగా సిలిండర్లు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, అందులో రేషన్‌కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలుగా ఉంది. మొత్తం సిలిండర్ ధర ముందే చెల్లించాల్సి ఉంటుంది. అందులో రూ.500 సిలిండర్​కు పోను మిగిలిన అమౌంట్ లబ్ధిదారు ఖాతాలో జమ అవుతుంది.

రాష్ట్రంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులు 11.58 లక్షల మంది ఉన్నారు. వీరంతా మహాలక్ష్మి స్కీమ్ పరిధిలోకి రానున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కంపెనీలకు ముందస్తుగా రూ.80 కోట్లు చెల్లించింది. ఈ స్కీమ్​లకు ఇంకా అర్హులను గుర్తించేందుకు ప్రజాపాలన కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, అందులో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Tags

Read MoreRead Less
Next Story