Liquor : మందుబాబులకు కష్టకాలం.. మద్యం షాపుల్లో బీర్ల కొరత

Liquor : మందుబాబులకు కష్టకాలం..  మద్యం షాపుల్లో బీర్ల కొరత

మందుబాబులకు కష్టకాలమొచ్చింది. తెలంగాణలో మద్యం షాపుల్లో బీర్ల కొరత ఏర్పడింది. వైన్‌ షాపుల్లో బ్రాండెడ్‌ బీర్లు దొరకని పరిస్థితి నెలకొంది. మద్యం డిపోలు ప్రధాన బ్రాండ్ల బీర్లపై రేషన్‌ విధించడంతో అటు వైన్‌షాప్‌ యజమానులు.. ఇటు కొనుగోలు దార్లు నిరుత్సాహానికి గురవుతున్నారు.

సరఫరా, విక్రయాల మధ్య అంతరం పెరగడంతో ఈ కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. బ్రూవరీల యాజమాన్యాలకు సకాలంలో డబ్బులు చెల్లించడంలో బెవరేజెస్ కార్పొరేషన్ విఫలం కావడంతో బీర్ల ఉత్పత్తిపై ప్రభావం పడినట్లు సమాచారం. రాష్ట్రంలోని 6 బ్రూవరీల్లో రోజుకు 2.50 లక్షల కేసుల బీరు తయారు చేయొచ్చు. ప్రస్తుతం 1.50 లక్షల కేసుల బీరు మాత్రమే తయారవుతుండటంతో డిమాండ్ పెరిగింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజుకు 60 వేల నుంచి 80 వేల కేస్ లకు పైగా బీర్లు అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. సమ్మర్ లో వీటికి అదనంగా మరో 20 వేల కేస్ లు డిమాండ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం డిమాండ్ కు తదిన స్టాక్ లేకపోవడంతో మద్యం డిపోలు 60 వేల నుంచి 80 వేల కేస్ లను మద్యం షాపులకు సరఫరా చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో...మందుబాబులు బీర్లు లాగించేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story