Inspiring Story : గ్రేట్.. మూడు గవర్నమెంట్ జాబులు కొట్టిండు

Inspiring Story : గ్రేట్.. మూడు గవర్నమెంట్ జాబులు కొట్టిండు

ఒకటి, రెండు, మూడు.. ఇవేమీ కార్పొరేట్ విద్యాసంస్థ లు ఇచ్చిన ర్యాంకింగ్ లు కాదు. అంతకన్నా విలువైనవి. అతను చేస్తున్నది ఒక వాచ్మెన్ ఉద్యోగం.. కానీ సాధించింది మాత్రం మూడు ప్రభుత్వ ఉద్యోగాలు (Government Jobs). ఓ వాచ్మెన్ ప్రభుత్వ రంగంలో ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించారు. అవును.. ఆకలి, పట్టుదల, నిరంతర కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. ప్రవీణ్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎడ్యుకేషనల్ మల్టీ మీడియా రీసెర్చ్ సెంటర్(ఈఎమ్మార్సీ)లో రాత్రిపూట వాచ్మెన్ గా పనిచేస్తున్న ప్రవీణ్... పది రోజుల వ్యవధిలోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు.

ఇటీవలే తెలంగాణ (Telangana) గురుకుల విద్యాలయాల బోర్డు (Gurukul Vidhyalaya Board) ప్రకటించిన ఫలితాల్లో... టీజీటీ, పీజీటి, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించారు. మంచిర్యాల జిల్లా జెన్నారం మండలం పొన్కల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ ప్రాధమిక విద్య నుంచి డిగ్రీ వరకు జెన్నారంలో పూర్తి చేశారు. ప్రవీణ్ తండ్రి పెద్దులు మేస్త్రీ పనిచేస్తుండగా, తల్లి పోచమ్మ బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ ప్రవీణ్ ను చదివించింది. తల్లిదండ్రులు కష్టాన్ని చూసిన ప్రవీణ్ ఉన్నత ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకున్నారు.

ఎంకాం, బీఈడీ, ఎంఈడీ ఓయూ క్యాంపస్లో చదుపుకున్నారు. ఖర్చుల కోసం ఈఎమ్మా ర్సీలో ఐదేళ్లుగా వాచ్ మెన్గా ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్దమయ్యాడు. అతని పట్టుదల, కష్టం ఫలించి... ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక య్యాడు. ప్రవీణ్ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటం పట్ల ఈఎమ్మార్సీ డైరెక్టర్, ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రవీణ్ స్పూర్తితో విద్యార్థులు, యువత ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.

Tags

Read MoreRead Less
Next Story