TS : ఒక్కొక్కరుగా జంప్.. కేటీఆర్‌లో వైరాగ్యం

TS : ఒక్కొక్కరుగా జంప్.. కేటీఆర్‌లో వైరాగ్యం

తెలంగాణ (Telangana) లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్‌ పార్టీకి వరుగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ ముఖ్య నేతలు సైతం బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెబుతున్నారు. అంతేకాదు.. వరంగల్‌ లోక్‌సభ నుంచి బీఆర్ఎస్ టికెట్‌ దక్కించుకున్న అభ్యర్థి కూడా తిరస్కరించారు.

బీఆర్ఎస్‌ను వీడిన నాయకులంతా కాంగ్రెస్‌కు క్యూ కడుతున్నారు. సీనియర్ నాయకులు బీఆర్ఎస్‌ను వీడుతున్న నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ ఒక్కరే ఒంటరిగా బయల్దేరి.. లక్షల మంది సన్యాన్ని కూడబెట్టారని అన్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సైన్యంతో కలిసి సాధించుకున్నారని కేటీఆర్ ఎక్స్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో అవమానాలు, ద్రోహులు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ చేదించారని చెప్పారు.

ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిందని గుర్తు చేశారు. ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వంలో ఉండి తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు కేసీఆర్ నింపారని అన్నారు. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలని అనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో రాసుకొచ్చారు. తెలంగాణ పోరాటంలో పాల్గొని.. రాష్ట్రాన్ని సాధించడంలో ప్రధాన భూమిక పోషించిన బీఆర్ఎస్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు పార్టీని కాపాడుకునేందుకు పోరాట పంథాలో కదం తొక్కుదాం అంటూ.. పార్టీ మారుతున్న నేతల ప్రభావం బీఆర్ఎస్‌పై ఉండబోదు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ పోస్ట్ ను గులాబీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story