TS : జూన్‌లో కేసీఆర్‌కు అసలు పరీక్ష.. పార్టీ ఉనికి తేలేది అప్పుడే!

TS : జూన్‌లో కేసీఆర్‌కు అసలు పరీక్ష.. పార్టీ ఉనికి తేలేది అప్పుడే!

బీఆర్ఎస్ కథ బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అన్నట్టగా తయారైంది. అసెంబ్లీ పోయింది.. లోక్ సభ పోతోంది.. తర్వాత జూన్ లో జరిగే అత్యంత కీలకమైన ఎన్నికల్లో బీఆర్ఎస్ పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ లో జరిగే చాన్సుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ జోరుగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే.. ఇప్పటికే చాలామంది లీడర్లకు టార్గెట్ పెట్టారు. బీఆర్ఎస్ ను ఖాళీ చేయించే పనిలో పడ్డ రేవంత్ అన్నంత పనిచేస్తున్నారు.

టాప్ లీడర్లే జంప్ అవుతున్న వేళ గ్రౌండ్ లెవెల్లో ఎంతమంది ఉంటారన్నది తేలాల్సి ఉంది. లోక్ సభ ఎన్నికలయ్యాక రాష్ట్ర స్థాయి నేతలు బీఆర్ఎస్ నుంచి వెళ్తారు.. వారితో పాటు..జిల్లా, మండల, గ్రామస్థాయి లీడర్లు ఎంతమంది వలస వెళ్తారన్నది తేలాల్సి ఉంది. ఇదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే జూన్ నెల బీఆర్ఎస్ చాలా ముఖ్యమైనదని చెప్పొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story