TS : కవిత ఇంకెన్ని రోజులు జైల్లో ఉంటుందంటే..!

TS : కవిత ఇంకెన్ని రోజులు జైల్లో ఉంటుందంటే..!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు మరో షాక్ తగిలింది. ఏప్రిల్‌ 23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ అయి ఏప్రిల్ 15తో నెల రోజులు అయ్యింది.

ఆదివారం సాయంత్రంతో సీబీఐ తమ కస్టడీ ముగించింది. దీంతో.. సోమవారం ఉదయాన్నే వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెను కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల జ్యూడీషియల్‌ కస్టడీ విధించాలని కోరుతూ అధికారులు కోర్టును కోరారు. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామని.. విచారణకు ఆమె సహకరించలేదని సీబీఐ ఆరోపించింది. ఐతే.. 9 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ తీర్పు ఇచ్చింది.

కవితను వెంటనే తిహార్ జైలుకు తరలించారు. రెండేళ్లుగా అడిగిందే అడుగుతున్నారని సీబీఐ, ఈడీ అధికారుల తీరు సరిగా లేదని కవిత అంటున్నారు. ప్రధాన నిందితుల సమక్షంలో కవితను విచారించే చాన్స్ ఉంది. నేర నిరూపణ జరిగితే ఇప్పటికే తిహార్ జైలులో ఉన్న మిగతా నిందితుల కంటే సుదీర్ఘ కాలం కవిత జైలులో ఉండే చాన్సుంది.

Tags

Read MoreRead Less
Next Story