TS : నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న కవిత భర్త!

TS : నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న కవిత భర్త!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) అరెస్టును సవాల్ చేస్తూ ఆమె భర్త ఇవాళ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఆమెను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను నిన్న తొలిరోజు విచారణ అనంతరం ఆమె భర్తతో పాటు కేటీఆర్, హరీశ్‌రావు కలిశారు.

కుటుంబసభ్యులను చూడగానే కవిత భావోద్వేగానికి గురైనట్టు తెలిసింది. ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్ ఆమెకు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చినట్టు సమాచారం. తొలుత కుటుంబసభ్యులను ప్రత్యేక రూమ్​లో ఉంచిన అధికారులు.. కవితను అక్కడికి తీసుకొచ్చారు. అనంతరం 40 నిమిషాల పాటు భేటీ జరిగింది. ఈ సందర్భంగా తొలిరోజు ఈడీ విచారణ జరిపిన తీరు, ఏమేం ప్రశ్నలు అడిగారు? తదితర వివరాలను కవితను అడిగి తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

కాగా, కవితతో భేటీ అనంతరం న్యాయ నిపుణులతో అనిల్, కేటీఆర్, హరీశ్ రావు మరోసారి చర్చలు జరిపారు. ఈ భేటీ అర్ధరాత్రి వరకు సాగింది. కవిత కేసును వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరిని కలిశారు. కాసేపు చర్చల అనంతరం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గీలు కూడా వర్చువల్ గా ఈ మీటింగ్ కు హాజరైనట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story