TS : బస్సుయాత్రకు కేసీఆర్ రెడీ!

TS : బస్సుయాత్రకు కేసీఆర్ రెడీ!

పార్లమెంట్ ఎన్నికల్లో డీలాపడ్డ బీఆర్ఎస్ లో జోష్ నింపాలని నిర్ణయించారు గులాబీ బాస్ కేసీఆర్. చేవెళ్ల, మెదక్ లోక్ సభ సెగ్మెంట్లలో సభలు పెట్టిన కేసీఆర్.. కేడర్ కు కొంత ఉత్సాహాన్ని ఇచ్చారని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో సెగ్మెంట్ కు ఒక సభ పెట్టి.. మిగతా ప్రధాన అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బస్సుయాత్ర చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్టు చెబుతున్నారు.

ప్రస్తుతానికి లీక్ వచ్చింది కానీ.. నవమి హడావుడి తర్వాత ఏప్రిల్ 18న కేసీఆర్ తన బస్సుయాత్రపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 18వ తేదీన తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది.

మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో అన్నింటికీ పోటీ చేయబోతున్న బీఆర్ఎస్.. ఎంపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయనుంది. కేసీఆర్ తన చేతులమీదుగా అభ్యర్థులకు బీ ఫారాలు ఇస్తారు. ఎన్నికల ఖర్చుల కోసం ఒక్కో క్యాండిడేట్ కు రూ. 95 లక్షల చెక్‌లు ఇవ్వనున్నారు కేసీఆర్. ఇదే మీటింగ్ లో బస్సు యాత్ర, రూట్ మ్యాచ్ కూడా ఫైనలైజ్ కానుంది. అసెంబ్లీ సెగ్మెంట్ ప్రధాన కేంద్రాలను టచ్ చేస్తూ కేసీఆర్ బస్సుయాత్ర సాగనుంది. మధ్యమధ్యలో కేసీఆర్ బసకు ఏర్పాట్లు చేస్తారు. కనీసం 10 రోజుల పాటు ఈ యాత్ర సాగే చాన్సుంది.

Tags

Read MoreRead Less
Next Story