TS : ఉద్యమకాలం నాటి కేసీఆర్ ను మళ్లీ చూస్తారు: కేసీఆర్

TS : ఉద్యమకాలం నాటి కేసీఆర్ ను  మళ్లీ చూస్తారు: కేసీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రాజకీయ గందరగోళం నెలకొంటుందని, ఏది జరిగినా బీఆర్ఎస్ కే మేలు అని వ్యాఖ్యానించారు. ఉద్యమకాలం నాటి కేసీఆర్ ను మళ్లీ చూస్తారని, ఇవాళే బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఖరారు చేస్తానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తమదే గెలుపని పార్టీ నేతలతో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్‌‌లో అంతా బీజేపీ పెత్తనమే నడుస్తోందని చెప్పారని తెలిపారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లోకి వచ్చారని చెప్పారు. గతంలో 104 మంది ఎమ్మెల్యేలున్న తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని, అలాంటిది 64 మందే ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదులుతుందా? అని కేసీఆర్ ప్రశ్నించారు.

తన కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై కేసీఆర్ తొలిసారి స్పందించారు. ‘ఢిల్లీ లిక్కర్ కేసు అంతా ఉత్తిదే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో BL.సంతోష్‌ను అరెస్ట్ చేయడానికి మనం పోలీసులను పంపించాం. అప్పటి నుంచి మోదీ మనపై కక్ష కట్టారు. అందుకే కవితను అరెస్టు చేయించి జైలుకు పంపారు. మోదీ దుర్మార్గుడు’ అని కేసీఆర్ విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story