TS : రేవంత్ గ్యారంటీలపై కేటీఆర్ సెటైర్లు

TS : రేవంత్ గ్యారంటీలపై కేటీఆర్ సెటైర్లు

ఒక్కటే గ్యారంటీ అమలు చేసి ఆరు గ్యారంటీలు అమలు చేసినట్టుగా కాంగ్రెస్ డబ్బా కొట్టుకుంటోందని ఫైరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలో ఒక్కటి అమలు చేసి.. మగవారికి, మహిళకు తాకులాట పెట్టిందని విమర్శించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతి నగర్, గాంధీచౌక్, తెలంగాణ చౌక్‌లో కరీంనగర్ పార్లమెంట్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారాయన.

కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడిన కేటీఆర్.. నేత కార్మికుల కోసం రూ.3వేలకోట్లు ఖర్చు చేసి కార్మికులను కాపాడుకున్నామన్నారు. ఐదేళ్లలో తాను ఎవరికీ నేరుగా రూపాయి, మందు పంచలేదని చెప్పలేదని.. జనంపై తనపై ప్రేమ చూపించారని చెప్పారు. సిరిసిల్లను డెవలప్ చేసి చూపించానన్నారు.

కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసి.. సోషల్ మీడియా సాయంతో క్షణాల్లో దొరికిపోతున్నారని చెప్పారు కేటీఆర్. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ని పట్టుకొని కాంగ్రెస్ నేతలు అనేక మాటలు, బూతులు మాట్లాడుతుందంటూ మండిపడ్డారు. వందరోజుల్లో రైతు రుణమాఫీ, పింఛన్లు వచ్చాయా? అంటూ ప్రశ్నించారు. ఓట్లు అడిగేటప్పుడు ఒక లెక్క.. ఓట్లు వేయించుకున్నాకా ఒక లెక్క ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు అంటూ విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story