TS : జోగులాంబ సాక్షిగా పంద్రాగస్ట్ లోపు రుణమాఫీ.. కేసీఆర్, హరీశ్‌కు సీఎం సవాల్‌

TS : జోగులాంబ సాక్షిగా పంద్రాగస్ట్ లోపు రుణమాఫీ.. కేసీఆర్, హరీశ్‌కు సీఎం సవాల్‌

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కేసీఆర్, హరీశ్ లకు స్ట్రాంగ్ సవాల్ విసిరారు. ఆగస్టు 15లోగా రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేసి చూపిస్తానని.. కేసీఆర్, హరీశ్ పార్టీని రద్దు చేసుకోవడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. పంద్రాగస్టు లోపల రుణమాఫీ చేయకపోతే పదవి నుంచి వైదొలగాలని హరీశ్‌రావు విసిరిన సవాల్‌ను రేవంత్‌రెడ్డి స్వీకరించి ప్రతి సవాల్ చేశారు.

మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో జరిగిన కొడంగల్ నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో రేవంత్ మాట్లాడారు. సూర్యుడు ఉదయించే దిశను మార్చుకున్నా.. భూమి ఆకాశం తలక్రిందులైనా, కేసీఆర్ ఫాంహౌజ్ లో ఉరి వేసుకొని సచ్చిన రైతులకు పంద్రాగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూసిస్తాననిమ సీరియస్ గా చెప్పారు రేవంత్ రెడ్డి.

బ్యాంకు అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15లోగా వడ్డీతో రుణాలను తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. బ్యాంకు అధికారులు రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. రుణాల చెల్లింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story