TS : అప్పులు, వడ్డీలకే రూ.26 వేల 374 కోట్లు చెల్లించాం: భట్టి విక్రమార్క

TS : అప్పులు, వడ్డీలకే రూ.26 వేల 374 కోట్లు చెల్లించాం: భట్టి విక్రమార్క

గతేడాది డిసెంబర్ నుంచి ఏప్రిల్ 15 వరకు ఏ శాఖపై ఎంత ఖర్చు చేశామనే వివరాలను ఆర్థిక మంత్రి భట్టి విడుదల చేశారు. మొత్తం రూ.66,507 కోట్లలో జీతాలకు రూ.22,328 కోట్లు, అప్పులు, వడ్డీలకు రూ.26,374 కోట్లు, రైతు భరోసాకు రూ.5,575 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. డిసెంబర్ 7, 2023 నాటికి రూ.3,960 కోట్ల నెగటివ్ బ్యాలెన్స్ ఉందని, తాము ఇప్పటివరకు రూ.17,618 కోట్ల అప్పులు తెచ్చామని మంత్రి పేర్కొన్నారు.

మేడిగడ్డకు రూ.కోట్ల ప్రజాధనం వెచ్చించారని, అది కూలిపోతే వాస్తవాలు ప్రజలకు తెలియకూడదా? అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రుణమాఫీపై స్పందిస్తూ.. ‘మేం 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పలేదు. కానీ రుణ మాఫీకి కట్టుబడి ఉన్నాం’ అని తెలిపారు. కరెంటు కోతలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమలకు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story