Holidays : మే 13, జూన్ 4న వేతనంతో కూడిన సెలవులు

Holidays : మే 13, జూన్ 4న వేతనంతో కూడిన సెలవులు

తెలంగాణలో మే 13న పార్లమెంట్ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4వ వెలువడనున్నాయి. తెలంగాణ సర్కారు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

ఈ రెండు రోజులను వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇటీవల ఇసి పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు పొడిగించింది.

ఇక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు వేసే వారిపై సీరియస్ యాక్షన్స్ ఉంటాయని ఈసీ ఇప్పటికే హెచ్చరించింది.

Tags

Read MoreRead Less
Next Story