Medaram Jatara : మేడారం జాతరకు రికార్డు ఆదాయం

Medaram Jatara : మేడారం జాతరకు రికార్డు ఆదాయం

Medaram Jatara : మేడారం జాతర హుండీల లెక్కింపు ముగిసింది. ఇప్పటివరకు ఆదాయం రూ. 12 కోట్లు వచ్చింది. గతంలో కన్నా ఇది రూ.26,29,553 ఎక్కువ కావడం గమనార్హం. మరోవైపు 800 గ్రాముల బంగారం, 55 కిలోల 150 గ్రాముల వెండి భక్తుల నుంచి కానుకగా వచ్చింది. నాణేల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆరు రోజుల పాటు లెక్కింపు జరపగా 540 హుండీలను తెరిచారు. బుధవారంతో కౌంటింగ్‍ ముగియనుంది.

2022 జాతరలో మొత్తం హుండీల కరెన్సీ ఆదాయం రూ.11,45,34, 526 కాగా, ఈసారి మంగళవారం నాటికి రూ.12 కోట్ల 71 లక్షల 79 వేల 280 నగదు వచ్చింది. వచ్చిన ఆదాయాన్ని డిపార్ట్​మెంట్​బ్యాంక్ అకౌంట్లో జమ చేసినట్లు అసిస్టెంట్‍ కమిషనర్‍ రామల సునీత, మేడారం ఈవో రాజేంద్రం తెలిపారు.

హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో మేడారం జాతర హుండీల లెక్కింపు జరుగుతుంది. లెక్కింపు కోసం సీసీ కెమెరాలతో పాటు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. కాగా నాలుగురోజుల పాటు వైభవంగా సాగిన మేడారం జాతరకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story