TS : బీజేపీకి అధికారమిస్తే తెలంగాణను మరింత అభివృద్ధి చేస్తాం: మోదీ

TS : బీజేపీకి అధికారమిస్తే తెలంగాణను మరింత అభివృద్ధి చేస్తాం: మోదీ

బీజేపీకి (BJP) అధికారమిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ‘రైతుల కోసం పసుపు బోర్డు తీసుకొచ్చాం. పంట ధరను క్వింటాల్‌కు రూ.6వేల నుంచి 30వేలకు పెంచాం. ఇక్కడి ప్రభుత్వాలు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయాయి. మేము రూ. 6,400కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించాం. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రగతిపై దృష్టి సారిస్తాం’ అని తెలిపారు.

కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని ప్రధాని మోదీ అన్నారు. ‘బీఆర్ఎస్ ప్రజలను దోచుకుంది. లిక్కర్ స్కామ్‌లోనూ కమీషన్లు తీసుకుంది. ఆ పార్టీ చేసిన అవినీతిపై కాంగ్రెస్ దర్యాప్తు చేయడం లేదు. దేశాన్ని దోచుకునేందుకే కుటుంబ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. తెలంగాణను కాంగ్రెస్ ATMగా మార్చుకుంది. రాష్ట్ర ప్రజల డబ్బు ఇప్పుడు ఢిల్లీ చేరుతోంది. తెలంగాణను దోచుకున్న వారిలో ఎవరినీ వదిలిపెట్టం’ అని పేర్కొన్నారు.

శక్తి (అధికారం) పైనే తమ పోరాటం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘శక్తిని నాశనం చేయాలని విపక్ష కూటమి భావిస్తోంది. భారతదేశం మొత్తం శక్తిని ఆరాధిస్తుంది. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4న తెలుస్తుంది. నేను భారతమాత పూజారిని. శక్తిస్వరూపులైన మహిళల రక్షణ కోసం ప్రాణాలు అర్పించేందుకు నేను సిద్ధం’ అని వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story