Medaram App : మేడారం యాప్ వచ్చేసింది.. నెట్ వర్క్ లేకున్నా వాడుకోవచ్చు

Medaram App : మేడారం యాప్ వచ్చేసింది.. నెట్ వర్క్ లేకున్నా వాడుకోవచ్చు

తెలంగాణ (Telangana) కుంభమేళా మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర (Sammakka Saralamma Jatara) కోసం వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ‘మై మేడారం యాప్‌’ను అందుబాటులోకి తెచ్చింది. ఇది భక్తులకు ఓ గైడ్‌గా పనిచేయనుంది. యాప్‌ ద్వారా జాతరలోని తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, పార్కింగ్‌ ప్రాం తాలు, మరుగుదొడ్లు, స్నానఘట్టాల వివరాలు, తప్పిపోయిన వారి కోసం మైక్‌ల ద్వారా పిలిచే కేంద్రాలు, ఫైర్‌ ఇంజన్‌ కేం ద్రాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. ప్లే స్టోర్‌ నుంచి ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. నెట్ వర్క్ లేకపోయినా ఈ యాప్ వాడుకోవచ్చు .

ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సమ్మక్క-సారలమ్మ జాతర జరగనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి జాతరకు కోటి 50 లక్షల మంది భక్తులు వస్తారని.. అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానిక మంత్రి, ఆదివాసి బిడ్డ సీతక్క అన్ని తానై మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. డారం చుట్టూ 8 కిలోమీటర్ల మేర 33 ప్రాంతాల్లో పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక బస్టాండ్‌తో పాటు.. 14 వేల మంది పోలీసులు, 500 సీసీ కెమెరాలు, 12 డ్రోన్ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు.

మేడారం జాతర నేపథ్యంలో ఆర్టీసీ వేలాది ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ బస్సులను ఆదివారం నుంచి ఫిబ్రవరి 25 వరకు నడిపించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 51 పాయింట్ల నుంచి, ఉమ్మడి వరంగల్​జిల్లాలో 18 ప్రాంగణాల నుంచి ప్రత్యేకంగా 6000 బస్సులను నడిపిస్తోంది. ఈ ప్రత్యేక బస్సులను ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా బస్సులను నడిపేందుకు ఆర్టీసీ(TSRTC) అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story