TS : ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ ఇతనే.. కొత్త పేరు!

TS : ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ ఇతనే.. కొత్త పేరు!

తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఇప్పటికే 14 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ఓకే చేసింది. మరో మూడు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కనీసం 14 స్థానాలను గెలిపించేలా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ టికెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మొదటి నుంచి బీఆర్ఎస్‌కు పట్టులేని ఈ జిల్లాలో కాంగ్రెస్ అధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. ఈ ఖమ్మం ఎంపీ టికెట్ కోసం పలువురు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇందులో ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి మధ్య టికెట్ వార్ నడుస్తోంది. టికెట్‌ను జిల్లా నాయకులకు కాకుండా నిజామాబాద్ జిల్లా ప్రముఖ నేతకు ఇవ్వనున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా కమ్మ నాయకుడు, సీఎం రేవంత్‌కు సన్నిహితుడిగా పేరు గాంచిన మండవ వెంకటేశ్వరరావుకు ఖమ్మం ఎంపీ టికెట్‌ను కాంగ్రెస్ హైకమాండ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోని భట్టి భార్య నందినికి, పొంగులేటి సోదరుడు ప్రసాద్‌కు చెక్ పెట్టేందుకే స్థానికేతురుడికి టికెట్ ఇస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఒకవేళ మండవ వెంకటేశ్వరరావుకి ఖమ్మం ఎంపీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ సెల్ప్ గోల్ వేసుకున్నట్లే అని, ప్రతిపక్షమైన బీఆర్ఎస్ విజయం సాధించటానికి అవకాశం ఇచ్చినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియాలంటే మరో వారం ఆగాల్సిందేనని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. వాయనాడ్ లో రాహుల్ కు ఎదురుగాలి ఉంటేకనుక... ఇక్కడినుంచి రెండో నామినేషన్ రాహుల్ తోనూ వేయించే చాన్స్ ఉందనేది మరో వాదన. తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story