TS : పార్టీ మారడం లేదు.. బీఆర్ఎస్‌లోనే ఉంటా: ఎర్రబెల్లి

TS : పార్టీ మారడం లేదు.. బీఆర్ఎస్‌లోనే ఉంటా: ఎర్రబెల్లి

తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) స్పందించారు. ‘నేను పార్టీ మారడం లేదు. బీజేపీలోకి వెళ్తున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు ఇలా ప్రయత్నిస్తున్నారు. క్యాడర్ అవన్నీ నమ్మవద్దు. కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తా’ అని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ వంద రోజుల పాలన ఫెయిల్ అయిందని ప్రజలు అనుకుంటున్నారని ఎర్రబెల్లి చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటిలు అమలు చేయలేదని.. ఎన్నికల కోసమే డ్రామా చేశారని ఆరోపించారు. కనీసం కేసీఆర్ (KCR) పెట్టిన పథకాలు కూడా అమలు చేయట్లేదని విమర్శించారు. మాయ మాటలు చెప్పడం, మోసాలు చేయడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటేనన్నారు ఎర్రబెల్లి.

Tags

Read MoreRead Less
Next Story