TS : వ్యక్తిగత విమర్శలు మానుకో.. రేవంత్‌పై డీకే అరుణ ఎదురుదాడి

TS : వ్యక్తిగత విమర్శలు మానుకో.. రేవంత్‌పై డీకే అరుణ ఎదురుదాడి

పాలమూరు బంగ్లా రాజకీయాలపై సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. డీకే అరుణ టార్గెట్ గా బీజేపీ సపోర్టర్స్ ను తనదైన శైలిలో ఎదుర్కొంటున్నారు. దీంతో.. రేవంత్ రెడ్డిపై బీజేపీ జాతీయ మహిళా అధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఫైర్ అయ్యారు.

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి పదే పదే డీకే అరుణ ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. సీఎం తన స్థాయిని మరిచి, మహిళను అని కూడా చూడకుండా.. వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా.. వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. ఓట్ల కోసం కొత్త కొత్త మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.

రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ వచ్చినప్పుడల్లా తనని అవమానించేలా మాట్లాడుతున్నాడని డీకే అరుణ ఆరోపించారు. అలాగే పాలమూరు ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. ఈ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి తమ ఓట్లతో బుద్ధి చెబుతారని డీకే అరుణ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story