TS : ఫోన్ ట్యాపింగ్.. కేసీఆర్ పై ఫిర్యాదు

TS : ఫోన్ ట్యాపింగ్.. కేసీఆర్ పై ఫిర్యాదు

కేసీఆర్ (KCR) హయాంలో చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్లు జరిగాయని ఆరోపిస్తూ హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఈ వ్యవహారానికి నాటి సీఎం కేసీఆర్ బాధ్యులని ఫిర్యాదుదారుడు, లాయర్ అరుణ్ కుమార్ ఆరోపించారు. ప్రముఖులు, తమకు వ్యతిరేకమని భావించిన అందరి ఫోన్లనూ ట్యాపింగ్ చేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పలు రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్ప డ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేంద్ర హోంశాఖ ప్రత్యేక అనుమతులతో మాత్రమే ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా అనుమానాలు ఉన్నవారి ఫోన్లను మాత్రమే ట్యాప్ చేయాల్సి ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రధాన నాయకుల ఫోన్లను ట్యాప్ చేయిం చినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయనను ఏ1 నిం దితుడిగా పేర్కొంటూ దీనిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు.A

Tags

Read MoreRead Less
Next Story