International Women's Day :విమెన్స్ డే సందర్భంగా.. ఎల్‌పీజీ సిలిండర్ పై రూ.100 తగ్గింపు

International Womens Day :విమెన్స్ డే సందర్భంగా.. ఎల్‌పీజీ సిలిండర్ పై రూ.100 తగ్గింపు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) సందర్భంగా ఈరోజు (మార్చి 8) వంట గ్యాస్ సిలిండర్ ధరలను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇది దేశవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా నారీ శక్తి (మహిళా శక్తి)కి ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన Xలో ఒక పోస్ట్‌లో తెలిపారు.

"వంట గ్యాస్‌ను మరింత సరసమైనదిగా చేయడం ద్వారా, మేము కుటుంబాల శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్ధారించడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది మహిళలకు సాధికారత కల్పించడం, వారికి 'ఈజ్ ఆఫ్ లివింగ్' భరోసా ఇవ్వడానికి మా నిబద్ధతకు అనుగుణంగా ఉంది" అని మోదీ చెప్పారు.

ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఉజ్వల యోజన కింద పేద మహిళలకు ఎల్‌పీజీ సిలిండర్ సబ్సిడీపై రూ. 300 పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం (మార్చి 7) ప్రకటించింది. ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో సబ్సిడీని రూ.200 నుండి పెంచింది. 14.2-కిలోల సిలిండర్‌లకు సంవత్సరానికి 12 రీఫిల్‌ల వరకు ఒక్కో సిలిండర్‌పై రూ. 300 వరకు అన్న మాట. రూ.300 సబ్సిడీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 31తో ముగుస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story