TS : బీఆర్ఎస్ నేత క్రిశాంకు పోలీసులు నోటీసులు

TS : బీఆర్ఎస్ నేత క్రిశాంకు పోలీసులు నోటీసులు

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రీశాం క్క హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి, తన సోదరుడు తిరుపతి రెడ్డిలు అవినీతికి పాల్పడ్డారని మన్నె క్రిశాంక్ సోషల్ మీడియా వేదికగా అభియోగాలు చేశాడు. దీంతో కాంగ్రెస్ నేత మహేశ్ గౌడ్ ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో మన్నె క్రీశాంక్ పై కేసు నమోదు అయ్యింది. మాదాపూర్ పోలీసులు క్రీశాంక్ కు 41 సీఆర్పీసీ కింద నోటీ సులు జారీ చేసి, ఆయన ఫోన్ ను సీజ్ చేశారు.

తాజాగా హైదరాబార్ సైబర్ క్రైం విభాగం వారు మరోసారి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి, విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ నోటీసుల్లో ఈ నెల 17 లోగా హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు హాజరు కావాలని తెలిపారు. కాగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ కు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు అందాయని తన ట్విట్టర్ ఖాతాలోనూ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story