TS : వర్షం అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్​అంటే వర్షం : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

TS : వర్షం అంటే కాంగ్రెస్..  కాంగ్రెస్​అంటే వర్షం : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

తాము గేట్లు తెరవకముందే కాంగ్రెస్‌లోకి ఇతర పార్టీల నేతలు వస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్‌ (KCR) చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కోమటిరెడ్డి మాట్లాడారు. ‘చేరికలపై మేమేం గేట్లు ఎత్తలేదు.. వాళ్లే దూసుకుని వస్తున్నరు. యాదగిరిగుట్ట పేరును మార్చడమే కేసీఆర్‌ చేసిన ఫస్ట్​మిస్టేక్. అక్కడ అవినీతి జరిగింది.

ఎన్నికల తర్వాత విచారణ చేపడతాం. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తం. ఆయన చేసిన పాపాల వల్ల కరవు వచ్చింది’ అని కోమటిరెడ్డి ఫైర్​అయ్యారు. ‘కేసీఆర్ ట్యాపింగ్ పాపంతో చాలా మంది పోలీసు అధికారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నరు. సీఎంఆర్ఎఫ్, కాళేశ్వరంలో దోపిడీ జరిగింది. దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారు.

వర్షం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే వర్షం. ఎంపీ ఎన్నికల తర్వాత హరీశ్​ బీజేపీలో చేరుతడు. పాత నాయకులకు అన్యాయం జరగదు.. జరిగితే మేము మాట్లాడమా. కే. కేశవరావు అపార అనుభవం ఉన్న నాయకుడు. కాంగ్రెస్ వచ్చి మూడు నెలలే అయ్యింది.. మా మీద దాడి చేయడం కేకే లాంటి వాళ్లకు నచ్చలేదు. అందుకే బయటకు వస్తున్నరు’ అని వెంకట్​రెడ్డి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story