TS : కేటీఆర్ చచ్చేదాకా నిరాహార దీక్ష చేయాలి.. రేవంత్ డిమాండ్

TS : కేటీఆర్ చచ్చేదాకా నిరాహార దీక్ష చేయాలి.. రేవంత్ డిమాండ్

ధర్నాచౌక్ లో బీఆర్ఎస్ దీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. ‘కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన కొన్ని నిధులు పెండింగ్లో ఉన్నాయనీ.. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నాచౌక్ లో కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మద్దతిస్తామన్నారు. గతంలో కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ అదే స్ఫూర్తిని తీసుకొని.. కేటీఆర్ సచ్చుడో, నగరానికి నిధులు వచ్చుడో అంటూ దీక్ష చేయాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

సికింద్రాబాద్‌లోని అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సీఎం రేవంత్ భూమి పూజ చేశారు. 11 కి.మీ పొడవు, 6 లేన్లతో రానున్న ఈ భారీ ఎలివేటేడ్ కారిడార్​ను రూ.2,232 కోట్లతో నిర్మాణం చేపట్టనున్నారు. భూమి పూజ అనంతరం మాట్లాడిన సీఎం.. గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీఆర్​ఎస్​ హయాంలో హైదరాబాద్‌లో గంజాయి, పబ్బులు, డ్రగ్స్‌ వచ్చాయని ఆరోపించారు.

కేసీఆర్ సర్కార్​లో అభివృద్ధి జరిగింది ఏమీ లేదన్న రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వం ప్రజల అవసరాలను మర్చిపోయిందని దుయ్యబట్టారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని రేవంత్ తెలిపారు. రెండో దశలో 75 కి.మీ మెట్రో విస్తరణ చేపట్టబోతున్నామని వివరించారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story