TS : తెలంగాణలో పెరుగుతున్న తట్టు కేసులు

TS : తెలంగాణలో పెరుగుతున్న తట్టు కేసులు

తెలంగాణలో తట్టు (మీజిల్స్) కేసులు పెరుగుతున్నాయి. 15 ఏళ్ల లోపు పిల్లలు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. గత 6 నెలల్లో సుమారు 1000 కేసులు నమోదయ్యాయి. HYDలో అత్యధిక కేసులు రికార్డయ్యాయి. పిల్లలకు వ్యాక్సిన్ లు వేయించకపోవడమే దీనికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్‌పై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచిస్తున్నారు.

లక్షణాలు ఇవే

తట్టు సోకిన వారిలో తీవ్ర జ్వరం, శరీరంపై దద్దుర్లు, కళ్లు ఎరుపెక్కడం, నోటిలో మచ్చలు వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శ్వాసకోశ సమస్యలు ఏర్పడుతాయని, వ్యాధి సోకిన 7-14 రోజుల్లో శరీరంపై ప్రభావం చూపుతుందని తెలిపారు. దగ్గు, తుమ్ముల ద్వారా ఇది ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలని సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story