TS : భానుడి భగభగ.. ఏప్రిల్ 2 వరకు వడగాలులు!

TS : భానుడి భగభగ..  ఏప్రిల్ 2 వరకు వడగాలులు!

భానుడి భగభగలతో తెలంగాణ (Telangana) మండిపోతోంది. పగటిపూట బయటికి రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలో మూడ్రోజుల పాటు సాధారణం కంటే గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె.నాగరత్న తెలిపారు 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశమున్నట్లు వెల్లడించారు.

దక్షిణ దిశ నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మూడ్రోజులు వడగాడ్పులు వీస్తాయని వివరించారు. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.

మరోవైపు ఇంటర్ విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ విద్యాసంవత్సరానికి ఇవాళే చివరి పనిదినం. మార్చి 31 నుంచి మే 31 వరకు సమ్మర్ హాలిడేస్ ఉండనున్నాయి. జూన్ 1న కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Tags

Read MoreRead Less
Next Story