Saleswaram Jatara : నేటి నుంచి 3 రోజుల పాటు సలేశ్వరం జాతర

Saleswaram Jatara : నేటి నుంచి 3 రోజుల పాటు సలేశ్వరం జాతర

లంగాణ అమర్‌నాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24 వరకు ఉ.7 నుంచి సా.6 వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతిస్తారు. నల్లమల అడవుల్లో కొండలు, వాగులు దాటుకుంటూ లోయ గుహలో వెలసిన లింగం దగ్గరకు చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు రాంపూర్‌పెంట వరకు బస్సులు, కార్లలో వచ్చి, అక్కడి నుంచి 5 కి.మీ దట్టమైన అడవుల్లో నడవాల్సి ఉంటుంది.

ఇది తెలంగాణ రాష్ట్రంలోని మాహబూబ్ నగర్ జిల్లాలో నల్లమల అడవులలో ఉంది. హైదరాబాదు నుండి శ్రీశైలం వెళ్ళే రహదారిలొ 150 కిలోమీటరు రాయి నుండి 32 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో ఉంది. ఆటవీ శాఖ వారి అనుమతితో ఆ దారెంబడి పది కిలోమీటర్ల దూరం వెళ్ల గానే రోడ్డు ప్రక్కన నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కనబడుతుంది.

సలేశ్వరం జాతర సంవత్సరాని కొక సారి చైత్ర పౌర్ణమికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులపాటూ జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతుంది గాన కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు "వత్తన్నం వత్తన్నం లింగమయ్యో" అంటు వస్తారు. వెళ్లేటప్పుడు "పోతున్నం పోతున్నం లింగమయ్యొ" అని అరుస్తూ నడుస్తుంటారు.

కరోనా కారణంగా రెండేళ్లు సలేశ్వరం యాత్ర నిలిపివేయడంతో 2022లో బ్రహ్మోత్సవాల సందర్భంగా లింగమయ్య దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే సలేశ్వరం చేరుకోవాలని అటవీశాఖ అధికారులు భక్తులకు ఆంక్షలు విధించడం గమనార్హం.

Tags

Read MoreRead Less
Next Story