Asifabad: బాలుడి ప్రాణం తీసిన దాగుడుమూతల ఆట..

Asifabad: బాలుడి ప్రాణం తీసిన దాగుడుమూతల ఆట..
Asifabad: ఆసిఫాబాద్‌ జిల్లాలో బాలుడి ప్రాణం తీసింది దాగుడుమూతల ఆట. ఈ ఘటన కౌటాల మండలం కన్నేపల్లిలో చోటుచేసుకుంది.

Asifabad: ఆసిఫాబాద్‌ జిల్లాలో బాలుడి ప్రాణం తీసింది దాగుడుమూతల ఆట. ఈ ఘటన కౌటాల మండలం కన్నేపల్లిలో చోటుచేసుకుంది. అభిషేక్‌ అనే బాలుడు నిన్న సాయంత్రం బడి నుంచి వచ్చాక తమ్ముడు, చెల్లితో కలిసి దాగుడుమూతల ఆట ఆడుతున్నాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు కైలాస్‌, రమ పొలానికి వెళ్లారు.


అయితే.. తమ్ముడు, చెల్లికి దొరక్కుండా ఉండేందుకు ఇంట్లో నిల్వ ఉంచిన పత్తి కుప్పలో చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో తల లోపలకు వెళ్లగా.. కాళ్లు బయటే ఉండిపోయాయి. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు అభిషేక్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story